దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం లేదు : అరవింద్ కేజ్రీవాల్

దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం లేదు : అరవింద్ కేజ్రీవాల్

శుక్రవారం నాడు ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్‌కౌంటర్‌ ఘటన పై దేశవ్యాప్తంగా హర్షద్వానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులపై అందరు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దానికితోడు రాష్ట్రంలోని నాయకులందరూ కూడా పోలీసులు తీసుకున్న చొరవకు సలాం కొడుతున్నారు. కాగా ఇలాంటి ఎన్ కౌంటర్ లు జరిగితేనే మహిళల పట్ల అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయని కొందరు ప్రముఖులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈనేపథ్యంలో షాద్ నగర్ ఎన్‌కౌంటర్‌ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు.

షాద్ నగర్ ఎన్‌కౌంటర్‌ జరిగిన నేపథ్యంలో స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ… దేశ ప్రజలందరూ కూడా ఇలా సంబురాలు జరుపుకోవడం సరికాదని, ఇది కూడా మనం చింతించాల్సిన విషయమేనని, దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం లేకనే ఇలా ప్రజలు సంబరాలు చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు గౌరవం కలిగించే నూతనమైన మార్గాలను అన్వేషించాలని, అధికారులు అందరు కూడా ప్రజలకు నిశితంగా వెల్లడించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు…