దిశ కాల్ లిస్ట్, కాల్ రికార్డ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు

దిశ కాల్ లిస్ట్, కాల్ రికార్డ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు

వెటర్నరి మహిళా డాక్టర్ దిశ రేప్ అండ్ మర్డర్ కేసు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే నింధితులను కఠినంగా శిక్షించాలంటూ దేశమంతటా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దిశ హత్య కేసులో నింధితులను 10 రోజుల పాటు న్యాయస్థానం పోలీసుల కస్టడీకి అప్పగించింది. అయితే తాజాగా నింధితులు చెప్పిన విషయాల ఆధారంగా దిశ హత్యాచార ఘటనకు సంబంధించి మరో కీలక ఆధారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే మొన్నటి వరకు దిశ ఫోన్‌ను కనుక్కున్నేందుకు ప్రయత్నించిన పోలీసులు, నేడు ఫోన్ ఏమైపోయిందన్న దానిపై నింధితులను విచారణ జరపగా దానిని పాతిపెట్టినట్టు ఆ నలుగురు ఒప్పుకున్నారు. దిశని పూడ్చిపెట్టిన చోటే బ్రిడ్జి కింద మట్టిని తవ్వి సెల్ ఫోన్ పూడ్చి పెట్టినట్టు పోలీసులకు తెలిపారు. అయితే నింధితులు చెప్పిన వివరాల ప్రకారం క్లూస్‌టీమ్‌ తనిఖీలు నిర్వహించి ఆ సెల్ ఫోన్ ను సేకరించింది. అయితే దిశ సెల్‌ఫోన్‌ ఆధారంగా కాల్ లిస్ట్, కాల్ రికార్డ్‌ను పరిశీలిస్తున్నారు.