ఢిల్లీ ముఖ్యమంత్రి ఖరారు…

ఢిల్లీలో ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. 48 మంది ఎమ్మెల్యేలు ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. రేఖా గుప్తాకు ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఆమె రెండుస్తారు ఎన్నికయ్యారు. ఢిల్లీ పీఠంపురా నుంచి కౌన్సిలర్‌గా, తర్వాత మేయర్‌గా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో, ముఖ్యమంత్రి పదవికి రేఖ గుప్తా, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి ప్రవేశ్ వర్మ పేరును ఖరారు చేశారు.