దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా 3 లక్షల 37వేల 704 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 488 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్ పాజిటివిటి రేటు 17.22 శాతానికి పెరిగింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పదివేల 50కి చేరాయి.
గడిచిన 24 గంటల్లో 2 లక్షల 42 వేల 676 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 21 లక్షల 13వేల 365 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 161 కోట్లకు పైగా కరోనా డోసుల పంపిణీ జరిగింది.