డెన్మార్క్‌ శాస్త్రవేత్తల కొత్త మందు

డెన్మార్క్‌ శాస్త్రవేత్తల కొత్త మందు

కోవిడ్‌ వైరస్‌ ఉపరితలాన్ని అతుకోవడం ద్వారా, సదరు వైరస్‌ మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిరోధించే ఒక మాలిక్యూల్‌ ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. డెన్మార్క్‌కు చెందిన ఆర్హస్‌ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. ఈ ఔషధి చౌకైనదని, కోవిడ్‌పై పోరులో ఉపయోగపడే యాంటీ బాడీల ఉత్పత్తితో పోలిస్తే దీన్ని ఉత్పత్తి చేయడం తేలికన్నారు. పీఎన్‌ఏఎస్‌ జర్నల్‌లో పరిశోధనా ఫలితాలను మంగళవారం ప్రచురించారు.

ఈ మాలిక్యూల్‌ ఆర్‌ఎన్‌ఏ ఆప్టమర్స్‌ జాతికి చెందిన కాంపౌండ్‌ అని, ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల తయారీలో ఉపయోగపడే బిల్డింగ్‌ బ్లాక్స్‌ దీనిలో ఉంటాయని తెలిపారు. 3డీ నిర్మితిలో మలిచేందుకు వీలయ్యే జన్యు పదార్ధం ను ఆప్టమర్‌ అంటారు. ఇవి నిరి్ధష్ట లక్షిత కణాలను కనుగొనే శక్తి కలిగి ఉంటాయి. ఈ మాలిక్యూల్‌ వైరస్‌ ఉపరితలానికి అతుక్కోగానే వైరస్‌లోని స్పైక్‌ ప్రోటీన్‌ మానవ కణంలోకి ప్రవేశించకుండా నిరోధించడం జరుగుతుందని పరిశోధకులు తెలిపారు. దీన్ని కేవలం కోవిడ్‌ నిరోధానికే కాకుండా, గుర్తించడానికి వాడుకోవచ్చన్నారు.