నేనేంటో చూపిస్త…. పవన్ సంచలన వ్యాఖ్యలు

ap deputy cm pawan kalyan
ap deputy cm pawan kalyan

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు నినాదాలు చేస్తూ.. కాసేపటికి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. సభలో వైసీపీ వ్యవహారశైలిపై మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడుతూ.. శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు. వెనక ఉండి మాట్లాడటం కాదు నేరుగా ముందుకు వచ్చి మాట్లాడాలి. నేనేంటో చూపిస్తా . రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అన్నిటికీ సిద్ధపడి రావాలి అని పవన్ పేర్కొన్నారు.