GVMC (గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్)లో డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సోమవారం విశాఖపట్నంలో పల్లా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. నిన్నటి వరకు.. డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కావడానికి ఒక కారణం ఉందన్నారు. గత రాత్రి 11.00 గంటలకు ఆ పదవి జనసేన పార్టీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ పదవి కోసం టీడీపీలో ఆశావాహులున్న మాట వాస్తవమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇక ఈ ఎన్నిక వాయిదా పడడానికి కోఆర్డినేషన్ సమస్య కూడా ఒక కారణమన్నారు.





