సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్…

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సీరియస్ అయ్యారు. సభలో సభ్యులు ఫోన్ మాట్లాడటంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్.. అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక అని, ఇక్కడి గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని డిప్యూటీ స్పీకర్ గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. ఫోన్‌ను సభ్యులు సైలెంట్‌లో పెట్టుకోవాలన్నారు.