జపాన్ బాక్సాఫీస్‌పై ‘దేవర’ ప్రభంజనం.. ఎప్పుడంటే?

'Devara' hits the Japanese box office.. when?
'Devara' hits the Japanese box office.. when?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటించిన రీసెంట్ సినిమా ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ ని పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అభిమానులని అలరించింది. ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా కావడంతో ఈ మూవీ సాలిడ్ వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ జపాన్‌లో దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది.

'Devara' hits the Japanese box office.. when?
‘Devara’ hits the Japanese box office.. when?

‘దేవర’ సినిమా ని జపాన్ దేశంలో మార్చి 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇటీవల ‘కల్కి 2898 ఎడి’ సినిమా ని జపాన్‌లో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ట్విన్, ఇప్పుడు ‘దేవర’ సినిమా ని కూడా రిలీజ్ చేయనుంది. ఇక ‘దేవర’ చిత్ర ప్రీ-సేల్స్‌ని జనవరి 3 నుంచి ప్రారంభించనున్నారు.

జపాన్‌లో ఎన్టీఆర్‌కి సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ‘దేవర’ సినిమాకి కూడా జపాన్‌లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘దేవర’ సినిమా లో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమా కి సంగీతం అందించాడు.