యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రలో, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర (Devara). బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ (saif ali khan)విలన్ పాత్రని పోషిస్తున్నారు. ఈ మూవీ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోవా లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ఒక స్టిల్ ని రిలీజ్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివ, రాజు సుందరం లతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ స్టిల్ లో ఉన్నారు. ఎన్టీఆర్ సింపుల్ గా, చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. NTR ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు .