75 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టించిన ‘దేవర’ సాంగ్!

'Devara' song created a record with 75 million views!
'Devara' song created a record with 75 million views!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’ కోసం అభిమానులు ఎంతలా వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ మూవీ లోని సాంగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో మంచి విజయాన్ని అందుకున్నాయి.

రీసెంట్‌గా ఈ మూవీ లోని సెకండ్ సాంగ్‌గా ‘చుట్టమల్లె’ను మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి రొమాంటిక్ మెలోడీ పాటగా ఈ సాంగ్ అభిమానులని ఆకట్టుకుంటోంది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో ఈ సాంగ్‌కి అదిరిపోయే క్రేజ్ వచ్చింది. రీల్స్ వీడియోలతో అభిమానులు ఈ సాంగ్‌కి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండటంతో దేవర మూవీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా, ‘చుట్టమల్లె’ సాంగ్ ఏకంగా 75 మిలియన్ వ్యూస్ మార్క్‌ని టచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

'Devara' song created a record with 75 million views!
‘Devara’ song created a record with 75 million views!

జాన్వీ కపూర్ అందాలకి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.