సీఎం అంటూ నేం ప్లేట్…పిచ్చి అంటున్న ఉమా !

జగన్ సీఎం నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం ఆయన పిచ్చికి పరాకాష్ట అంటూ తీవ్రంగా స్పందించారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. పీకే ఇచ్చిన సలహాలతో జగన్ ఏం చేస్తున్నాడో తెలికుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఫలితాలు రావటానికి ముందే జగన్ సీఎం నేమ్ ప్లేట్ తయారు చేయించుకోవటం ఓవర్ కాన్ఫిడెన్స్ అని పీకే టీమ్ జగన్ ఇవ్వాల్సిన ఫైనల్ పేపెంట్ కోసమే ఆయన్ను భ్రమల్లో ఉంచుతోందని ఎద్దేవా చేశారు. ఓటింగ్ శాతం పెరగకుండా నియంత్రించేందుకు ఈసీ కుట్ర చేసిందని అలాగే టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్న పోలింగ్ బూత్ లలోనే ఈవీఎంలు పనిచేయలేదని ఇది కూడా ఈసీ చేసిన కుట్రలో భాగమేనని విమర్శించారు. అయినా ప్రజలు కసిగా ఓటింగ్ లో పాల్గొని బుద్ధి చెప్పారన్నారు. కేసు ఉందనే కారణంతో వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ను చర్చకు ఈసీ వద్దంటోందని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఈవీఎంలు ఎలా హ్యాక్ చేయవచ్చో చూపినందుకు అందరినీ అప్రమత్తం చేసినందుకే ఆయనపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 31 కేసులున్న జగన్, 13 కేసులున్న విజయ్ సాయిరెడ్డి ఫిర్యాదులపై ఈసీ వెంటనే స్పందించడం వెనుక అంతర్యం ఏంటని నిలదీశారు.