పూనమ్…ఏంటీ రచ్చ ?

పూనమ్ బాజ్వా తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా మంచి పేరే సంపాదించుకుంది. తెలుగులో అవకాశాలు ఎప్పుడో తగ్గిపోయినా, తమిళ్ కన్నడ సినిమాల్లో అవకాశాలు మొన్నటి వరకు బాగానే వచ్చాయి. ఇప్పుడు అవి కూడా సన్నగిల్లడంతో అందాల ఆరబోత కు తెరతీసింది పూనమ్. అందాలను ఆరబోస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజులిచ్చి , వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. ఈమధ్య కాలంలో సోషల్ మీడియా లో తొడల అందాలతో పటు ఎద అందాలను కూడా పరిచింది పూనమ్. మొదటి సినిమా అంటూ 2005లో తెరంగేట్రం చేసిన పూనమ్…ఆ తర్వాత పలు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషా చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగార్జున సరసన ‘బాస్’ చిత్రం, భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పరుగు’ తదితర చిత్రాలు తెలుగులో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.