ధడక్ మూవీ రివ్యూ…

Dhadak Movie Review

నటీనటులు: జాన్వి కపూర్‌, ఇషాన్‌ ఖట్టర్‌‌, అశుతోష్‌ రానా, అంకిత్‌ బిష్ట్‌, ఆదిత్య కుమార్‌
సినిమాటోగ్రఫీ: విష్ణు రావ్‌
నిర్మాతలు: కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శశాంక్‌ ఖైతాన్‌

కొన్ని రోజులుగా బాలీవుడ్ సినీ ప్రేక్షకులే కాదు బాషలతో సంబంధం లేకుండా అతిలోక సుందరి శ్రీదేవి అభిమానులు సైతం ధడక్‌ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ ఈ మూవీ తో ఇండస్ట్రీ కి పరిచయం కావడమే. శ్రీదేవి హటాన్మరణం పొందడంతో ఆమెను కూతురిలో చూసుకుందాం అనుకున్న వారు లక్షల్లో ఉన్నారు. అందుకే ‘ధడక్‌’ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. శ్రీదేవి 300లకు పైగా చిత్రాల్లో నటించిన సూపర్‌స్టార్.‌ దాంతో జాన్విపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉంటాయి. అదీకాక మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ‘సైరాట్‌’కు ఇది రీమేక్‌. మరి ‘సైరాట్’‌ సృష్టించినన్ని రికార్డులు ‘ధడక్’ సృష్టిస్తుందా? తొలి చిత్రంతో జాన్వి తల్లికి తగ్గ తనయ అనిపించుకుందా? లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కధ ఏంటంటే :

వేర్వేరు కులాలకు చెందిన ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం, అది ఇంట్లో వారికి నచ్చక గొడవచేయడం లాంటి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ధడక్‌ కూడా అలాంటి నేపధ్యం ఉన్న కధే. రాజస్థాన్‌లో పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకుడు, వ్యాపారి కూతురు అయిన పార్థవి (జాన్వీ) తక్కువ కులానికి చెందినవారికి మర్యాద ఇవ్వకూడదని వారితో మాట్లాడకూడదని ఇంట్లో వారికి షరతులు పెట్టె తండ్రి మాట వినక కులం ఏదైనా అందరూ మనుషులే అని ఆమె నమ్ముతుంది. ఈ నేపథ్యంలో మధుకర్‌(ఇషాన్‌ ఖత్తర్‌), పార్థవిని చూసి ఇష్టపడతాడు. కానీ తన ప్రేమ చెప్పడు ఎందుకంటే మధుకర్‌ పిరికివాడు జాన్వి ధైర్యవంతురాలు. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ విషయం పార్థవి తండ్రికి తెలీడంతో పెద్ద గొడవవుతుంది. ఇద్దరినీ విడదీయాలనుకుంటారు. మరి వీరు విడిపోయారా ? లేక కలుస్తారా ? అనేది కథ.

వేర్వేరు కులాలకు చెందిన ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం, అది ఇంట్లో వారికి నచ్చక గొడవచేయడం కొత్త కధేమీ కాదు ఈ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ‘సైరాట్‌’ సినిమా చూసినవారికి ఇందులో నటీనటులు తప్ప కొత్తదనం ఏమీ కనిపించదు. కొన్ని సన్నివేశాలను ‘సైరాట్‌’ నుంచి తీసుకుని రీమేక్‌ చేసినవే. శశాంక్‌ రాసుకున్న కథ, కథనం ఆయన దర్శకత్వ ప్రతిభను మరోసారి రుజువు చేస్తాయి. సున్నితమైన ప్రేమ కథకు ఘాటైన విలనిజాన్ని జోడించి అందంగా తెరకెక్కించారు.
ఇషాన్‌ ఎనర్జిటిక్‌గా చాలా బాగా నటించాడు. జాన్వి కూడా తన నటన, అందంతో మెప్పిస్తుంది. సినిమాలో ఆమె కళ్లతో పలికించే హావభావాలు, అమాయకత్వం ఆకట్టుకుంటాయి. మ్యూజిక్, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా జాన్వి కి మంచి ఓపెనింగ్ చిత్రం అని చెప్పొచ్చు.

తెలుగు బులెట్ పంచ్ లైన్ : ధడక్… ఒక మరపురాని లవ్ స్టోరీ
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 3 / 5