దిల్‌రాజు అనుమానించినట్లే అయ్యింది

Negative talk on lover movie

రాజ్‌ తరుణ్‌ హీరోగా రిద్ది హీరోయిన్‌గా తెరకెక్కిన ‘లవర్‌’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని హర్షిత్‌ రెడ్డి నిర్మించాడు. దిల్‌రాజు ఈ చిత్రాన్ని సమర్పించాడు. రాజ్‌ తరుణ్‌ బలవంతం చేయడంతో ఈ చిత్రానికి సమర్పకుడిగా దిల్‌రాజు వ్యవహరించేందుకు ఒప్పుకున్నాడు. దిల్‌రాజు బ్యానర్‌ అనడంతో లవర్‌ చిత్రంపై అంచనాలు పెరిగాయి. అయితే సినిమా విడుదలకు ముందు ఒక ప్రెస్‌మీట్‌లో దిల్‌రాజు మాట్లాడుతూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేయడం జరిగింది. లవర్‌ చిత్రాన్ని తనకు ఆసక్తి లేకుండానే తీసుకోవాల్సి వచ్చింది. రాజ్‌ తరుణ్‌పై ఎక్కువ బడ్జెట్‌ పెట్టాం. ఈ చిత్రాన్ని దర్శకుడు అంతగా ఆసక్తికరంగా తెరకెక్కించలేక పోయాడు అంటూ సన్నిహితులతో చెప్పుకొచ్చాడు.

దిల్‌రాజు సన్నిహితుల వద్ద ఏదైతే చెప్పుకొచ్చాడో అదే జరిగింది. రాజ్‌ తరుణ్‌ ఇమేజ్‌కు సూట్‌ అయ్యే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించలేదు. కాని రాజ్‌ తరుణ్‌కు చాలా కాలం క్రితం ఇచ్చిన మాట కోసం ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాల్సి వచ్చిందని ఈ సందర్బంగా దిల్‌రాజు సన్నిహితులతో చెప్పాడని, సినిమా ఫ్లాప్‌ అని ముందే దిల్‌రాజుకు తెలుసు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మీడియాతో కూడా మాట్లాడుతూ లవర్‌ను తక్కువ చేసి మాట్లాడాడు. ఈ చిత్రంను భారీ ఎత్తున విడుదల చేయడం వల్ల ఖర్చు దండగ తప్ప ఫలితం ఉండదు అని ముందే ఊహించిన దిల్‌రాజు తక్కువ థియేటర్లలో విడుదల చేయడం జరిగింది. మొత్తానికి లవర్‌ విషయంలో దిల్‌రాజు జడ్జిమెంట్‌ నూటికి నూరు శాతం నిజం అయ్యింది.