మళ్లీ కెలికిన వర్మ.. సంజు చెత్త అంటున్నాడు

ram gopal varma about sanju movie

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా సంచలనాత్మకంగానే ఉంటుంది. అంతా సూపర్‌ అంటే ఆయన మాత్రం చెత్త అంటాడు. అంతా చెత్తగా ఉంది అంటే ఆయన మాత్రం చాలా బాగుంది అంటూ ప్రశంసలు కురిపిస్తాడు. అందరు చూసే యాంగిల్‌లో కాకుండా విరుద్దమైన యాంగిల్‌లో వర్మ చూస్తాడు. అందుకే ఆయన వివాదాల దర్శకుడు అయ్యాడు. తాజాగా వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ‘సంజు’ చిత్రాన్ని చూశాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ చిత్రంపై విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. దాదాపు 500 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇంతటి విజయాన్ని దక్కించుకున్న సంజు చిత్రంపై వర్మ విమర్శలు చేస్తున్నాడు.

వర్మ తాజాగా ‘సంజు’ చిత్రంపై స్పందిస్తూ.. ఇటీవలే సంజు చిత్రాన్ని చూశాను. సంజయ్‌ దత్‌ గురించి అన్ని అబద్దాలను ఆ చిత్రంలో చూపించారు. ముంబయి బాంబు పేలుళ్ల కేసు సంజయ్‌ దత్‌ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ బాంబ్‌ పేలుడు కేసు వల్ల సంజు జీవితం మొత్తం నాశనం అయ్యిందని అనుకున్నారు. కాని సినిమాలో మాత్రం అలా చూపించలేదు. సంజయ్‌ దత్‌ను ఒక హీరోగా, ఒక మంచి వ్యక్తిగా మాత్రమే చూపించారు. సినిమాలో నిజాలు చూపించలేదు అంటూ దర్శకుడు వర్మ అంటున్నాడు. అందుకే త్వరలోనే తాను సంజయ్‌ దత్‌ జీవితంలోని ముఖ్యమైన ఘటం ముంబయి బాంబు పేలుడు సంఘటన ఆధారంగా ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. సంజయ్‌ దత్‌ జీవితంలో చాలా కీలకమైన ఆ విషయాలను దర్శకుడు సంజు చిత్రంలో సరిగా చూపించలేదు. నిజాలు ప్రేక్షకులకు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే తాను మళ్లీ సంజును తెరకెక్కిస్తాను అంటూ వర్మ ప్రకటించాడు. అయితే వర్మ గతంలో చాలా సినిమాలను ప్రకటించాడు. కాని ఎక్కువ శాతం కార్యరూపం దాల్చలేదు. మరి సంజు చిత్రం పరిస్థితి ఏంటో చూడాలి