టీవీ ప్రీమియర్‌కి వచ్చేస్తున్నా ధనుష్ ‘రాయన్’….!

Dhanush is coming to the TV premiere of 'Rayan'....!
Dhanush is coming to the TV premiere of 'Rayan'....!

తమిళ హీరో ధనుష్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా ‘రాయన్’ గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు . ఈ మూవీ పూర్తి మాస్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా ప్రేక్షకులని అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఈ మూవీ లోని మాస్ అంశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌కి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది.

ఇక ఈ మూవీ ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్‌ని దక్కించుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు భాషలోనూ ఈ మూవీ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే, ఇప్పుడు ఈ మూవీ బుల్లితెరపై సత్తా చాటేందుకి సిద్ధమయ్యింది. రాయన్ మూవీ ని దీపావళి కానుకగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేయనున్నట్లు ప్రముఖ టీవీ ఛానల్ జెమిని అనౌన్స్ చేసింది. దీపావళి సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకులకు అందించబోతున్నట్లు వారు ప్రకటించారు.

Dhanush is coming to the TV premiere of 'Rayan'....!
Dhanush is coming to the TV premiere of ‘Rayan’….!

థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసిన రాయన్, బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో అనేది చూడాలి. ఇక ఈ మూవీ లో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.