తమిళ స్టార్ హీరో ధనుష్ తనదైన విలక్షణమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల హిందీలో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఆత్రంగి రే చిత్రంతో అలరించిన ధనుష్ తాజాగా నటించిన మూవీ మారన్. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అర్జున్ త్యాగరాజన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో ధనుష్‌కు సరసన మాళవికా మోహనన్ నటిస్తుండగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్లు ఇప్పటికే అలరించగా మూవీపై అంచనాలు పెంచాయి.
తాజాగా మారన్ సినిమా తెలుగు ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలుగు విడుదల చేసింది. ఈ చిత్రం మార్చి 11 నుంచి నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ విషయానికస్తే ధనుష్ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నాడు. జర్నలిజం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ధనుష్ జర్నలిస్ట్‌గా కనిపించనన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అలాగే ధనుష్, మాళవిక మోహనన్‌ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.