చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఇక్కడ అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ పిచ్ ఛేజింగ్ చేయడానికి అనుకూలంగా ఉండటంతో టాస్ గెలిచిన వెంటనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ మరోమాట లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ వేసిన సమయంలో రోహిత్ మాట్లాడుతూ.. మ్యాచ్ జరిగే కొద్ది పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ముందుగా బౌలింగ్ తీసుకున్నట్లు తెలిపాడు.
‘మేము కొన్ని వ్యూహాత్మక మార్పులు చేశాం. పిచ్ పరిస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యం. జయంత్ యాదవ్ ప్లేస్‌లో నీషమ్ తుది జట్టులోకి వచ్చాడు. కౌల్టర్ నైల్ స్థానంలో ధవల్ కులకర్ణి వచ్చాడు. మాకు ప్రతీ గేమ్ ముఖ్యమే. భవిష్యత్తు మ్యాచ్‌ల గురించి చూడటం లేదు. ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్‌పైనే మా దృష్టి’ అని చెప్పుకొచ్చాడు.
ఇక సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని మాట్లాడుతూ.. ‘ మేము కూడా ముందుగా ఫీల్డింగ్ చేయాలనుకున్నాం. మేము ఇక్కడ ఆడిన చివరి గేమ్‌ను బట్టి తొలుత బౌలింగే మంచిదనుకున్నాం. ఈ పిచ్‌లో ఆరంభంలో బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంటుంది. క్రమేపీ బ్యాటింగ్ అనుకూలంగా మారుతోంది. ఈ ఐపీఎల్‌లో ప్రతీ టీమ్ ప్రదర్శన మెరుగ్గానే ఉంది. గేమ్ జరిగే రోజు ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారు’ అని పేర్కొన్నాడు.