ధోనీ క్రేజ్ తెలుసుకోడానికి ఈ ఒక్క సంఘటన చాలేమో !

dhoni craze in one picture

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు . మైదానంలో కనిపించినా, స్టేడియం బయట కనిపించినా.. ఆ ప్రదేశమంతా ధోనీ.. ధోనీ.. అని హోరెత్తాల్సిందే. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నా, అభిమానుల హృదయాల్లో ధోనీకి ఏమాత్రం క్రేజ్‌ తగ్గదు. ఇటీవల మొహాలీ లో ఇండియా శ్రీ లంక వన్డే సిరీస్ లో రెండో వన్డేలో భారత్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంక బరిలోకి దిగింది.

లంకేయులు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ధోనీ అభిమాని ఒకరు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని కీపింగ్‌ చేస్తున్న ధోనీ వద్దకు వచ్చాడు. రాగానే అతనికి పాదాభివందనం చేసి అతని వెంట తీసుకొచ్చిన పెన్ను, చిన్న అట్టపై ఆటోగ్రాఫ్‌ ఇవ్వాల్సిందిగా కోరాడు. ఈ సమయంలోనే అప్రమత్తమై సిబ్బంది అభిమాని వద్దకువచ్చి అతన్ని మైదానం నుంచి తీసుకువెళ్లారు. ఇలాంటి ఘటనలు ధోనీకి కొత్తేమీ కాదు. ఈ ఏడాది ఆరంభంలో విజయ్‌ హజారే ట్రోఫీలో ఎంఎస్‌ కాళ్లకు దండం పెట్టి ఆటోగ్రాఫ్‌లు కూడా తీసుకున్నారు.