ధోనీ తొలిప్రేమ గురించి తెలుసా ?

Dhoni first love story

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి ప్రేయసి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రేమకి ముందే ధోనీకి మరో ప్రేమ ఉందట ఈ మధ్య జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో తన తొలి ప్రేమ గురించి వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల సమయంలో చెన్నై జట్టు ఆటగాళ్లని తన ఇంద్రజాలంతో కాసేపు వేదికపై ఆటపట్టించిన మెజీషియన్… చివర్లో ధోనీ‌ తొలి ప్రేమ గురించి అడిగి… అతని హావభావాలు ఆధారంగా ఒక పేరు రాశాడు. అనంతరం అందరికీ చూపించి… చివర్లో ధోనీనే స్వయంగా చెప్పమన్నాడు.

అప్పటికే ఆ పేరును చూసిన ధోనీ… ‘అవును నా తొలి ప్రేమ ఆమెతోనే. తన పేరు స్వాతి. ఈ విషయం నా భార్య(సాక్షి)కి మాత్రం చెప్పకండి… సరేనా..?’ అని సరదాగా ధోనీ నవ్వులు పూయించాడు. చివరిసారి స్వాతీని ఎప్పుడు కలిశావు..? అని ప్రశ్నించగా… 1999లో… 12వ తరగతి చదివేటప్పుడు అని ధోనీ సమాధానమిచ్చాడు. అయితే ఈ విషయం తన భార్య సాక్షితో మాత్రం చెప్పొద్దని అక్కడి వాళ్లతో అన్నాడు. ఆ మాటలకు అక్కడి వారంతా నవ్వుల్లో తేలిపోయారు.