చిరు కోసం క్రేజీ బీట్స్ రెడీ చేసిన అనిరుద్?

Did Anirudh prepare crazy beats for Chiru?
Did Anirudh prepare crazy beats for Chiru?

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు సాలిడ్ లైనప్ ని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఆల్రెడీ భారీ విజువల్ డ్రామా మూవీ “విశ్వంభర” షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగా దీని తర్వాత యంగ్ దర్శకులు అనీల్ రావిపూడి అలాగే మరో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సాలిడ్ ప్రాజెక్ట్ లు మెగాస్టార్ ఓకే చేశాడు .

అయితే వీటిలో శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న మూవీ ఒక యాక్షన్ ప్రాజెక్ట్ కాగా దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వర్క్ చెయ్యొచ్చు అని అప్పట్లోనే టాక్ వచ్చింది. అయితే ఈ మూవీ కోసం అనిరుద్ దాదాపు లాక్ అయ్యినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో అనిరుద్ ఇది వరకు కంటే మరిన్ని మూవీ లు చేయనున్నాడు అని ఆ మధ్య టాక్ వచ్చింది.

అలా తాను ఓకే చేసిన మూవీ ల్లో ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కూడా ఒకటని టాక్. మరి అనిరుద్ మన సీనియర్ హీరోస్ కి ఏ రేంజ్ బీట్స్ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక విక్రమ్, ఒక జైలర్, రీసెంట్ గా జైలర్ 2 కి కూడా వాళ్ళ రేంజ్ బీట్స్ కొట్టాడు. మరి మెగాస్టార్ లాంటి హీరోకి కూడా అదే తరహా బీట్స్ ను రెడీ చేస్తాడని చెప్పొచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్నది .