ప్రస్తుతం రామ్, బోయపాటి కాంబోలో వస్తున్న ‘స్కంద‘ చిత్రం పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. స్కంద కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగాడంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రం స్కంద. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీ పై ఆడియెన్స్ కు భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ విపరీతమైన ప్రేక్షకాదరణ కూడా పొందాయి. ఇందులో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించారు . శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా ని నిర్మించారు. స్కంద మూవీ సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్ కానుంది. ఈ నెల 25న ఈ మూవీ కొత్త ట్రైలర్ చూస్తే.. ఆడియెన్స్ కు యాక్షన్ ఫీస్ట్‌లా ఉన్నది . ఇందులో యాక్షన్, డైలాగ్స్ రామ్ ఇరగదీసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం రామ్ తన మేకోవర్ ను పూర్తిగా చేంజ్ చేసుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోగా మారిన రామ్.. అదే జోరును ఈ సినిమాతోనూ కొనసాగించాడు. బోయపాటి మూవీ కోసం రామ్ తెగ కష్టపడ్డాడట. రామ్ తన క్యారెక్టర్ కోసం ఏకంగా 12కిలోల బరువు పెరిగాడట. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సఫ్ చెప్పాల్సిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాకు ఇప్పటికే ఓ రేంజ్లో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. స్టార్ సంస్థ సౌత్‌లోని అన్ని భాషల నాన్-థియేట్రికల్ రైట్స్ ను దాదాపు రూ.50 కోట్లకు కొనుక్కుందని టాక్ బాగా వినిపిస్తోంది. స్కంద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వంద కోట్ల గ్రాస్ మార్కును క్రాస్ చేయాల్సి ఉండే . ఈ మూవీ ను వినాయక చవితికి తీసుకురావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల ఈ సినిమా ని సెప్టెంబరు 28కి వాయిదా వేశారు.