క్రిప్టోకి అనుకూలంగా నిర్ణయం

క్రిప్టోకి అనుకూలంగా నిర్ణయం

క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త ! కేంద్రం బడ్జెట్‌లో క్రిప్టోకి అనుకూలంగా నిర్ణయం వెలువడింది. భారత ఆర్థిక వ్యవస్థకు పురోగతి అందించే విధంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ‘డిజిటల్‌ రూపీ’ 2022-23లో ప్రవేశపెట్టబోతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల లావాదేవీలపై 30 శాతం టాక్స్‌ విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా తెలిపారు. ప్రైవేట్‌ క్రిప్టో లావాదేవీల్లో పన్ను విధానం లేదు. కానీ ప్రభుత్వం తెచ్చే డిజిటల్‌ రూపీలో పన్ను విధానం ఉంటుందని ఆర్థిక మం‍త్రి స్పష్టం చేశారు.

క్రిప్టో కరెన్సీకి భారత్‌లో అనుమతులు ఇవ్వాలంటూ ఇటీవల డిమాండ్లు వినిపించాయి. కేంద్రం సైతం శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై చర్చిస్తామని చెప్పింది. అయితే ఆర్బీఐ అధికార వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాలేదు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ నేరుగా బడ్జెట్‌ ప్రసంగంలో క్రిప్టో అంశాన్ని చేర్చింది కేంద్రం. ఇప్పటికే పలు దేశాల్లో ప్రభుత్వ ఆధీనంలో క్రిప్టో వ్యవస్థలు పని చేస్తున్నాయి.