ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య తేజస్వినితో కలిసి తిరుపతి వచ్చిన దిల్ రాజు నేటి ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయన సతీమణికి తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు.
ఈ నేపథ్యంలో దిల్ రాజు మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. దిల్ రాజు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇది రెండో సారి. మేలో తేజస్వినితో వివాహం అనంతరం దిల్ రాజు శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.