దిల్ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్న దిల్ రాజు నిర్మాతగా రాణిస్తున్నాడు. తెలుగు టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరిగా ఉన్న ఆయన ఇటీవల వరుస విజయాలు అందుకున్నారు. ఎఫ్ 2, మహర్షి వంటి చిత్రాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ప్రస్తుతం ఆయన బేనర్ నుండి పలు ప్రాజెక్టులు థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే దిల్ రాజు యంగ్ ఫిలిం మేకర్స్‌ని కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తారనే విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో తక్కువ బడ్జెట్‌తో ఆసక్తిర కథా చిత్రంగా ఎవ్వరికి చెప్పొద్దు అనే సినిమా రూపొందింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు తన బేనర్‌పై రిలీజ్ చేస్తున్నారు. రాకేష్ వర్రే, గార్జేయి ఎల్ల ప్రగడ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బసవ శంకర్ తెరకెక్కించారు. ఇటీవల ఈ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ చూసిన దిల్ రాజుకి స్టోరీ లైన్ ఎంతగానో నచ్చడంతో ఆయన ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాడు. తన సొంత బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పైనే సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు.