భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలోని తెలంగాణనగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. షకీల్ (20) అనే యువకుడిని అతని స్నేహితుడు హత్య చేశాడు. కత్తితో మెడ నరకడంతో షకీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.