దిల్‌రాజు ఏదైనా సినిమాను నిర్మించినా లేదంటే పంపిణీ చేసినా కూడా ఖచ్చితంగా ఆ సినిమా మినిమం గ్యారెంటీ సక్సెస్ అవుతుందనే నమ్మకం తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఏదో ఒకటి రెండు సినిమాలు మినహా దిల్‌రాజుకు ఎక్కువ సక్సెస్‌లే దక్కాయి. తాజాగా దిల్‌రాజు బ్యానర్లో మూడు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాయి. అందులో మొదటిది శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రంలో నితిన్ మరియు రాశిఖన్నాలు హీరోయిన్స్‌గా నటించిన విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్ల చేసేశారు. ఈ సమయంలోనే ఈ చిత్రంకు దిల్‌రాజు కేవలం నిర్మాత మాత్రమే కాదని, దర్శకుడిగా, స్క్రిప్ట్ రైటర్‌గా, కథ రచయితగా కూడా వ్యవహరించాడు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మీడియాలో తన గురించి వస్తున్న వార్తలపై దిల్‌రాజు తాజాగా సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. కొన్నాళ్ల క్రితం తాను తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుంటున్న సమయంలో ఈ చిత్రం కథ నాకు ఆలోచన వచ్చింది. అప్పుడే దర్శకుడు సతీష్ వేగేశ్నకు ఈ కథను చెప్పాను. ఆయన మరింతగా డెవలప్ చేసి, మంచి చిత్రంగా శ్రీనివాస కళ్యాణంను తెరకెక్కించడం జరిగిందని దిల్‌రాజు చెప్పుకొచ్చాడు. అంతే తప్ప ఈ చిత్రం దర్శకత్వంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, అసలు తాను ఎప్పుడు కూడా దర్శకుడి పనిలో జోక్యం చేసుకోనని, పూర్తి స్వేచ్చను దర్శకుడికి ఇస్తేనే మంచి ఔట్ పుట్ వస్తుందని నమ్మే నిర్మాతను అంటూ దిల్‌రాజు చెప్పుకొచ్చాడు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందే కాదు, ఎప్పుడు కూడా తాను సినిమా దర్శకత్వంలో వేలు పెట్టను అంటూ చెప్పుకొచ్చాడు.