‘ఫిదా’కు ‘శ్రీనివాసకళ్యాణం’కు సంబంధం ఏంటి?

Dil Raju follow Fidaa movie Sentiment for Srinivasa Kalyanam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా హీరో వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘ఫిదా’ చిత్రం గత సంవత్సరం ఏ రేంజ్‌ విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత సంవత్సరం టాప్‌ చిత్రాల జాబితాలో ఫిదా నిలిచింది. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న ఫిదా చిత్రానికి ప్రస్తుతం నితిన్‌, రాశిఖన్నా జంటగా తెరకెక్కుతున్న శ్రీనివాస కళ్యాణం చిత్రానికి సంబంధం కలిపాడు నిర్మాత దిల్‌రాజు. ఈ రెండు సినిమాలు కూడా తమ బ్యానర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమాలు అయ్యేలా ఆయన ప్లాన్‌ చేస్తున్నాడు. ఫిదా సినిమా ఏ తేదీన అయితే విడుదల అయ్యిందో అదే తేదీన శ్రీనివాస కళ్యాణంను విడుదల చేయాలని దిల్‌రాజు ఆశ పడుతున్నాడు.

గత సంవత్సరం జూన్‌ 21న ఫిదా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు అదే తేదీన ‘శ్రీనివాస కళ్యాణం’ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా షూటింగ్‌ను హడావుడిగా ముంగించబోతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం మొన్నటి సంక్రాంతికే శ్రీనివాస కళ్యాణం విడుదల కావాలి. కాని హీరో సెట్‌ అవ్వక పోవడంతో పాటు, ఇతర కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. అందుకే ఫిదా డేట్‌కు విడుదల చేసి సెంటిమెంట్‌గా సక్సెస్‌ను దక్కించుకోవాలని దిల్‌రాజు భావిస్తున్నాడు. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఫిదా డేట్‌కు రాబోతున్న శ్రీనివాస కళ్యాణం సక్సెస్‌ అవుతుందా అనేది చూడాలి. శతమానం భవతి చిత్ర దర్శకుడు సతీష్‌ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు అనే విషయం తెల్సిందే.