రవితేజకు సిగ్గులేదన్న పవన్‌

Pawan Kalyan speech in Nela Ticket movie audio

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రవితేజ హీరోగా తెరకెక్కిన ‘నేల టికెట్‌’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంకు పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. పవన్‌ హాజరు అవ్వడంతో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను పవన్‌ వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో రవితేజపై పవన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. పవన్‌ చేసిన ఆ సరదా వ్యాఖ్యలు రవితేజ స్థాయిని పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

‘నేలటికెట్‌’ ఆడియో విడుదల కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. రవితేజ అంటే నాకు చాలా కాలంగా అభిమానం. ఆయన సినిమాల్లో సిగ్గు లేకుండా నటిస్తాడు. అది నా వల్ల కాదు. ఏ పాత్రల్లో అయినా కూడా సిగ్గు బిడియం లేకుండా నటించడం ఆయన గొప్పదనం అని చెప్పుకోవాలి. అలా నటించడం కొందరి వల్లే అవుతుంది. రవితేజతో తాను ఈ విషయం గతంలో కూడా చెప్పినట్లుగా పవన్‌ పేర్కొన్నాడు. ఇదే సమయంలో రవితేజ మాట్లాడుతూ చాలా సంవత్సరాల క్రితం పవన్‌ నాకు ఫోన్‌ చేసి అంత సిగ్గు లేకుండా ఎలా నటిస్తావయ్యా అంటూ ప్రశ్నించాడు. అదే నాకు పెద్ద కాంప్లిమెంట్‌ అంటూ చెప్పుకొచ్చాడు. సిగ్గు లేకుండా నటిస్తాడు కనుక రవితేజ చేసిన పాత్రలు అన్ని కూడా ప్రేక్షకులు ఇప్పటికి గుర్తు పెట్టుకున్నారు అని చెప్పుకోవచ్చు. కెమెరా ముందుకు వెళ్లిన తర్వాత అన్ని కూడా వదిలేసి నటించాలి అనేది రవితేజ ఉద్దేశ్యం. అందుకే రవితేజ ఈస్థాయి నటుడు అయ్యాడు.