ఆ మాయ దర్శకుడు ఎవరబ్బా..?

poonam kaur sensational comments on director

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మద్య శ్రీరెడ్డి చేస్తున్న, చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెల్సిందే. శ్రీరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చనీయాంశం అవుతున్న సమయంలో ఆమెకు పోటీగా అన్నట్లుగా హీరోయిన్‌ పూనం కౌర్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె ఒక దర్శకుడిని టార్గెట్‌గా చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అయితే ఆ దర్శకుడి పేరును మాత్రం ఆమె రివీల్‌ చేయలేదు. సినిమా పరిశ్రమలో ఆయనకు మంచి పేరుందంటూ ఆమె చెప్పుకొచ్చాడు. ఆయన మద్దతు ఉన్న హీరోయిన్స్‌ సక్సెస్‌ లేకున్నా కూడా హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో కొనసాగవచ్చు అంటూ పూనం చెప్పుకొచ్చింది.

ఆ దర్శకుడి గురించి పూనం మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో ఒక దర్శకుడు ఉన్నాడు. ఆయన సినిమాలను మాత్రమే కాకుండా మనుషులను కూడా డైరెక్ట్‌ చేస్తూ ఉంటాడు. ఆయన డైరెక్ట్‌ చేసినట్లుగా మనుషులు నటించాలి లేదంటే ఇండస్ట్రీలో కొనసాగడం అసాధ్యం. నన్ను కూడా ఆయన డైరెక్ట్‌ చేయబోయాడు. కాని నేను ఒప్పుకోలేదు. దాంతో ప్రస్తుతం నా పరిస్థితి ఇది. ఇక ఆయన అండదండలతో ప్రస్తుతం ఒక హీరోయిన్‌ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఆమెకు ఈమద్య వరుసగా ఫ్లాప్‌లు పడ్డాయి. అయినా కూడా ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఆయన దర్శకత్వంలో ఆమె నిజ జీవితంలో నటిస్తున్న కారణంగానే ఆమెకు అవకాశాలు వస్తున్నాయని పూనం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూనం హింట్‌ ఇచ్చిన ఆ దర్శకుడు ఎవరై ఉంటారా అంటూ సినీ వర్గాల్లో, మీడియా వర్గాల్లో తెగ చర్చ జరుగుతుంది. పూనం ఆ దర్శకుడి పేరును రివీల్‌ చేయాలని అంతా డిమాండ్‌ చేస్తున్నారు. మరి పూనం ఏం చేస్తుందో చూడాలి.