పేరు మాత్రమే కాదు కలెక్షన్స్‌ కూడా..!

mahanati movie collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంకు మంచి టాక్‌ వచ్చింది. సినీ విశ్లేషకులు, సినీ వర్గాల వారు, ప్రేక్షకులు ఇలా అన్ని వర్గాల వారు కూడా సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కొన్ని సినిమాలకు మంచి పేరు వస్తుంది కాని కలెక్షన్స్‌ రావు. కాని మహానటి చిత్రానికి అలా జరగలేదు. మహానటి చిత్రంకు ఎంతగా పేరు వస్తుందో అదే స్థాయిలో వసూళ్లు కూడా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు సాధిస్తున్న మహానటి టాలీవుడ్‌ టాప్‌ చిత్రాల జాబితాలో చేరుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భరత్‌ అనే నేను మరియు రంగస్థలం చిత్రాలను పూర్తిగా కలెక్షన్స్‌ డ్రాప్‌ చేసిన మహానటికి ప్రస్తుతం మెహబూబా చిత్రం పోటీగా నిలువబోతుంది.

మొదటి రెండు రోజుల్లో మంచి కలెక్షన్స్‌ను సాధించిన ‘మహానటి’ వారాంతం పూర్తి అయ్యే వరకు మరింతగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. మెహబూబా టాక్‌ను బట్టి మహానటి కలెక్షన్స్‌లో హెచ్చ తగ్గులు ఉంటే ఉండవచ్చు కాని, మొత్తానికి నిర్మాతలు ఆశించిన కలెక్షన్స్‌కు దాదాపు డబుల్‌ కలెక్షన్స్‌ వస్తాయని ట్రేడ్‌ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమాతో అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలను దక్కించుకోవడం ఖాయం. మహానటిగా నటించిన కీర్తి సురేష్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది. సావిత్రిలా ఆమె నటించకుండా, అచ్చు సావిత్రిలా జీవించింది అంటూ టాక్‌ వినిపిస్తుంది. సినిమాలో కనిపించిన ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వారి పాత్రల్లో ఒదిగి పోయి ఆకట్టుకున్నారు. సావిత్రి జీవితాన్ని కళ్ల ముందుకు తీసుకు వచ్చిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు అందరు కూడా చేతులెత్తి ప్రణామాలు చేస్తున్నారు.