వినాయక్‌తో సినిమా.. బాలయ్య ప్లాన్‌ ఇది

balakrishna next movie planning on vv vinayak

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సంక్రాంతి కానుకగా వచ్చిన జైసింహా ఫ్లాప్‌ అవ్వడంతో బాలయ్య తదుపరి సినిమాకు కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్‌ చిత్రాన్ని సెట్స్‌ పైకి తీసుకు వెళ్లాల్సి ఉంది. కాని దర్శకుడు తేజ తప్పుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ సినిమా ఆలస్యం అవుతుంది. ఎన్టీఆర్‌ సినిమాకు తగ్గ దర్శకుడి కోసం వినాయక్‌ చూస్తున్నాడు. ఎన్టీఆర్‌ సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అంతకంటే ముందే ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని బాలయ్య నిర్ణయించుకున్నాడు. అందుకోసం వినాయక్‌ను సిద్దం చేస్తున్నాడు. సి కళ్యాణ్‌ నిర్మాణంలో బాలయ్య హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో సినిమా ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

‘ఎన్టీఆర్‌’ సినిమాకు దర్శకుడి ఎంపికకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం కోసం ఇంకా స్క్రిప్ట్‌ కూడా పూర్తి కాలేదు. అందుకే గ్యాప్‌ ఎక్కువ కాకూడదనే ఉద్దేశ్యంతో వినాయక్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెలలో సినిమాను ప్రారంభించి దసరాకు సినిమాను విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నాడు. జై సింహ చిత్రంతో నష్టాలు చవి చూసిన నిర్మాత సి కళ్యాణ్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని బాలయ్య ముందే నిర్ణయించుకున్నాడు. అందుకే వినాయక్‌ దర్శకత్వంలో నటించబోతున్న సినిమాకు సి కళ్యాణ్‌ నిర్మాతగా వ్యవహరించే అవకాశం దక్కింది. వినాయక్‌, బాలయ్యల కాంబినేషన్‌లో గతంలో ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమా కూడా అదే విధంగా పవర్‌ ఫుల్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు.