టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్‌రాజు గత సంవత్సరం వరుసగా పలు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన విషయం తెల్సిందే. 2017లో సక్సెస్‌లతో డబుల్ హ్యాట్రిక్‌ను దక్కించుకున్న దిల్‌రాజు ఈ సంవత్సరం మాత్రం ఫ్లాప్‌లతో హ్యాట్రిక్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. దిల్‌రాజు ఈ సంవత్సరం ఆరంభంలో సందడి చేయలేదు. ద్వితీయార్థంలో ‘లవర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. ఆ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన శ్రీనివాస కళ్యాణం చిత్రం కూడా దిల్‌రాజుకు తీవ్ర నిరాశను మిగిల్చింది. గత సంవత్సరం చేసిన శతమానంభవతి చిత్రం స్థాయిలో ఈ చిత్రం సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు ఆశించారు. కాని ఫలితం తారు మారు అయ్యింది.
గత సంవత్సరం పలు చిత్రాలను నిర్మించిన దిల్‌రాజు ఈ ఏడాది మాత్రం మూడు సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి ఫలితం చేదును మిగిల్చాయి. ఇక ఈ సంవత్సరంలో దిల్‌రాజు నిర్మించిన ఒక్క చిత్రం మాత్రమే విడుదల కాబోతుంది. అదే ‘హలో గురు ప్రేమకోసమే’. దసరా కానుకగా రాబోతున్న ఆ చిత్రంలో రామ్ హీరోగా నటించాడు. ఆ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఏమీ లేవు. అంచనాలు లేకపోవడం మంచిదే అయినా కూడా ఓపెనింగ్స్ పరంగా ఆ ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ సంవత్సరంలో రామ్ అయినా దిల్‌రాజుకు సక్సెస్‌ను ఇస్తాడా లేదా అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తికర ప్రశ్నగా ఉంది. ఈమద్య కాలంలో దిల్‌రాజు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కున్నది లేదు. వచ్చే ఏడాది ఈయన నిర్మాణంలో పెద్ద సినిమాలు రాబోతున్నాయి. మరి వచ్చే ఏడాది అయినా దిల్‌రాజుకు పరిస్థితులు కలిసి వస్తాయో చూడాలి.