Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత సంవత్సరం మంచి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దిల్‌రాజు భారీ లాభాలను కూడా దక్కించుకున్నాడు. గత సంవత్సరంలో దిల్‌రాజు బ్యానర్ నుండి వచ్చిన సినిమాలు మరియు ఆయన పంపిణీ చేసిన సినిమాలు అన్ని కూడా ప్రేక్షకులను మెప్పించాయి. దాంతో కోట్ల వర్షం కురిసింది. కాని ఈ సంవత్సరం ఆరంభంలోనే దిల్‌రాజుకు ‘మెహబూబా’ రూపంలో గట్టి ఎదురు దెబ్బ తలిగింది. ఏకంగా 8 కోట్ల నష్టం ఆ సినిమా వల్ల వచ్చిందంటూ సమాచారం అందుతుంది. ఆ సినిమాపై అంచనాలు భారీగా రావడంతో దిల్‌రాజు ఆ సినిమాను ఎక్కువ మొత్తం పెట్టి కొనుగోలు చేశాడు. కనీస ఆలోచన లేకుండా ఆ సినిమాను కొనుగోలు చేయడం వల్ల చేతులు కాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినది. అందుకే తన తదుపరి సినిమాలకు జాగ్రత్త పడుతున్నాడు.
నితిన్ హీరోగా రాశిఖన్నా హీరోయిన్గా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీనివాసకళ్యాణం’ చిత్రంను జూన్ చివర్లో విడుదల చేయాలని భావించారు. ఫిదా విడుదలైన తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసి సెంటిమెంట్‌ను వినియోగించుకోవాలని భావించాడు. కాని జూన్ చివర్లో సినిమా విడుదల చేయాలి అంటే కాస్త హడావుడిగా సినిమాను పూర్తి చేయాలి, ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా ఎక్కువ సమయం ఉండదు. అలా విడుదల చేస్తే ప్రేక్షకులను సరిగా రీచ్ కాలేము. దాంతో పాటు హడావుడి చిత్రీకరణ వల్ల తప్పులు దొర్లే అవకాశం ఉంది. అందుకే మెల్లగానే పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. నితిన్ సినిమా వచ్చేందుకు రెండు నెలలు అదనంగా వేచి చూడాల్సిన పరిస్థితి.