క్రిష్‌పై దిల్‌రాజుకు ఇంత నమ్మకమా?

Dil Raju Taken Telugu Distribution Rights With 20crs Krish Producing Film
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విభిన్న చిత్రాల దర్శకుడిగా తనకంటూ బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న క్రిష్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘మణికర్ణిక’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఒక వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూ మరో వైపు ఫస్ట్‌ఫ్రేమ్‌ బ్యానర్‌లో సినిమాలను నిర్మిస్తున్నాడు క్రిష్‌. తెలుగులో సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించేందుకు క్రిష్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో సంకల్ప్‌ రెడ్డి రాసిన కథ క్రిష్‌కు బాగా నచ్చిందని, అందుకే తానే స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు భారీ డిమాండ్‌ ఉంది. 

క్రిష్‌ నిర్మించబోతున్న వరుణ్‌, సంకల్ప్‌ రెడ్డిల చిత్రంపై దిల్‌రాజు దృష్టి పడ్డట్లుగా తెలుస్తోది. షూటింగ్‌ కూడా ప్రారంభం కాని ఈ చిత్రాన్ని దిల్‌రాజు ఏకంగా 20 కోట్లు పెట్టి తెలుగు రాష్ట్రా డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఓవర్సీస్‌ రైట్స్‌ను దక్కించుకుంది.

మొత్తానికి క్రిష్‌ నిర్మాత అవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమాకు ఖచ్చితంగా 40 కోట్ల మేరకు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించనున్నట్లుగా దర్శకుడు సంకల్ప్‌ పేర్కొన్నాడు. ‘ఘాజీ’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంస దక్కించుకున్న ఈయన మరో విభిన్న నేపథ్యంలో వరుణ్‌ తేజ్‌తో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.