విభ‌జ‌న హామీలు ఏపీ హ‌క్కుః చంద్ర‌బాబు

Special Category status is our right says Chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కేంద్ర ప్ర‌భుత్వం విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌నందువ‌ల్లే పోరాట‌పంథాను ఎంచుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు స్ప‌ష్టంచేశారు. విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు, విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాలు ఆంధ్రుల హ‌క్క‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు. అమ‌రావ‌తిలోని ఉండ‌వ‌ల్లిలో ముఖ్య‌మంత్రి నివాసం వద్ద గ్రీవెన్స్ హాల్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు మాట్లాడారు. విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌డం కేంద్ర‌ప్ర‌భుత్వం బాధ్య‌త‌ని, హామీల అమ‌లు సాధ‌న‌లో రెండో ఆలోచ‌నే లేద‌ని, విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న‌వ‌న్నింటినీ సాధించేంత‌వ‌ర‌కూ విశ్ర‌మించేదిలేద‌ని తేల్చిచెప్పారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందించ‌డం కోసం కొత్త విష‌యాలు నేర్చుకుంటూనే ఉంటాన‌న్నారు.

ఈ నెల 27నాటికి తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 40 ఏళ్ల‌వుతోంద‌ని, రాజ‌కీయ జీవితంలో అన్నీ చూశాన‌ని చెప్పారు. ఐదు న‌దులు అనుసంధానం చేసి మ‌హాసంగ‌మం ఏర్పాటు చేస్తామ‌ని సీఎం తెలిపారు. మ‌హాసంగ‌మం సాకార‌మైతే రాష్ట్రంలో క‌ర‌వు అనేది ఉండ‌ద‌న్నారు. రాష్ట్ర హ‌క్కుల కోసం పోరాడుతూనే అభివృద్ధిలోదూసుకెళ్తున్నామ‌ని చంద్రబాబు చెప్పారు.