దిల్ రాజు ప్రొడక్షన్ లో మహేష్ బాబు !

Dil Raju To Produce Mahesh Next

మహేశ్ బాబు 25వ సినిమాగా ‘మహర్షి’ నిర్మితమవుతోంది. ఏప్రిల్ చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తన 26వ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయాలని మహేశ్ బాబు అనుకున్నాడు. అయితే స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా సిద్ధం కావడానికి 6 నెలల సమయం పడుతుందని సుకుమార్ చెప్పడంతో, ఈ లోగా అనిల్ రావిపూడితో సినిమా చేయాలని మహేశ్ బాబు నిర్ణయించుకున్నాడట. వరుస సినిమాలతో అనిల్ రావిపూడి వరుస విజయాలను అందిస్తూ రావడమే మహేశ్ బాబు దృష్టిలో ఆయనను పడేలా చేసింది. మొదటి నుంచి అనిల్ రావిపూడిపై నమ్మకం ఉంచుతూ వస్తోన్న దిల్ రాజు, ‘ఎఫ్ 2’తో భారీ లాభాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మహేశ్ – అనిల్ సినిమాను నిర్మించడానికి ఆయనే ముందుకు వచ్చాడనేది తాజా సమాచారం. నిజానికి మహేష్ సొంత ప్రొడక్షన్ లో ఈ సినిమా చేయాలనీ ముందు అనుకున్నాడు, ఆతర్వాత గతంలో కొన్ని తన సినిమాల ద్వారా నష్టపోయిన అనిల్ సుంకరను ఆదుకోవడం కోసం, ఈ సినిమా నిర్మాణంలో ఆయనని మహేశ్ బాబు భాగస్వామిని చేయలని అనుకున్న్నాడు. అయితే ఇప్పుడు దిల్ రాజుని అనిల్ సుంకర ని కలిపాడని అంటున్నారు. దీని మీద అధికారిక సమాచారం అందాల్సి ఉంది.