అనిల్ రావిపూడికి దిల్ రాజు స్పెషల్ గిఫ్ట్

Dilraj Special Gift In Anil Ravipudi

ప్రేక్షకులు ఏ కథాంశాలను ఇష్టపడతారో అన్నివర్గాల ప్రేక్షకులను థియేటర్ కి రప్పించాలంటే ఆ కథాంశం ఎలాంటిదై ఉండాలనే విషయంలో దిల్ రాజుకి పూర్తి క్లారిటీ వుంది. అందువల్లనే ఆయన ఖాతాలో ఎక్కువ విజయాలు కనిపిస్తాయి. ఈ ఏడాది ఆరంభంలోనే ఆయన ‘ఎఫ్ 2’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా భారీ లాభాలను తీసుకురావడంతో, ప్రొడక్షన్ టీమ్ ను ఆయన బ్యాంకాక్ పంపించారు. ఇందుకోసం ఆయన 50 లక్షల వరకూ ఖర్చు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. జనవరి 12న విడుదలైన ఈ సినిమా తాజాగా 50 రోజులను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా టీమ్ కి ‘ఐ ఫోన్’ లు కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. తనకి ఓ స్పెషల్ గిఫ్ట్ అందిందని అనిల్ రావిపూడి చెప్పాడు. ఆయన అందుకున్న కానుక ‘బీఎండబ్ల్యూ’ కారు అని చెప్పుకుంటున్నారు. త్వరలో మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి చేసే సినిమాకి కూడా దిల్ రాజు నిర్మాత అనే సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కూడా హిట్ కొడితే ఈసారి ఏమిస్తాడో ? మరి.