చిరు 151వ మూవీ మారిందా?

chiranjeevi 151 movie with koratala siva

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రంగా ‘ఖైదీ నెం.150’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం తర్వాత 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని ప్రారంభించారు. చిరు 150వ సినిమా వచ్చి సంవత్సరం నర అవుతుంది. అయినా ఇప్పటి వరకు తదుపరి సినిమా రాలేదు. చిరు సైరా మూవీ వచ్చే ఏడాది వేసవిలో రావడం ఖాయం అయ్యింది. సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్‌ భారీ ఎత్తున చిత్రీకరించాల్సి ఉంది. అందుకే కాస్త ఆలస్యం అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సమయంలోనే చిరంజీవి మరో సినిమాను కొరటాల దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు. చిరంజీవి 151వ చిత్రంగా కొరటాల మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

భరత్‌ అనే నేను చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ను దక్కించుకున్న కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని చిరంజీవి హీరోగా చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. అందుకు సంబంధించిన కథ చర్చలు కూడా పూర్తి అయ్యాయి. రెండు మూడు నెలల్లో ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నారు. కొరటాల ఏ సినిమాను అయినా కేవలం అయిదు ఆరు నెలల్లోనే పూర్తి చేస్తాడు. అంటే సైరా కంటే కొరటాల దర్శకత్వంలో మూవీ మొదట పూర్తి అయ్యే అవకాశం ఉంది. అందుకే చిరంజీవి 151వ చిత్రంగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు చిరు 151వ చిత్రం సైరా అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో కొరటాల మూవీ వస్తే సైరాపై బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పడే అవకాశం ఉందని, అలా కాకుండా జాగ్రత్తగా కొరటాల మూవీని ప్లాన్‌ చేయాలంటూ మెగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.