క్రిష్ వెబ్ సిరీస్…!

Director Krish Web Series
క్రిష్ మణికర్ణిక సినిమా తరువాత ఎంతో ప్రతిస్టాత్మకంగా రూపొందిస్తున్నా చిత్రాన్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం దాదాపుగా షూటింగ్ పుర్తికావచ్చింది. మొదటి భాగం కథానాయకుడు సంక్రాంతికి విడుదలవుతుంది.మహానాయకుడు కూడా దాదాపుగా పుర్తికావచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ తరువాత దర్శకుడు క్రిష్ వెబ్ సిరీస్ ను నిర్మించే పనిలో  బిజీగా ఉన్నడు. అయన ప్రస్తుతం దర్శకుడి గానే కాకుండా నిర్మాతా గాను వ్యవహరిస్తున్నాడు. వరుణ్ తేజ్ అంతరిక్షం సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ఈ వెబ్ సిరీస్ రాజ రాజ చోళుడు అనే చారిత్రాత్మక నేపధ్యం కలిగిన ఓ కథను నిర్మించ దలిచాడు దీనికి దర్శకత్వ భాద్యతలు తమిళ స్టార్ డైరక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తాడు.గతంలో ఈ డైరక్టర్ భాషా, ప్రేమ, ఇంద్రుడు…చంద్రుడు.. మాస్టర్ వంటి సూపర్ హిట్ట్ చిత్రాలను నిర్మించాడు. క్రిష్ రాజ రాజ చోళుడు అనే కథను ఆరు భాగాలుగా నిర్మించదలిచాడు. ఇది  తెలుగు, తమిళంలో వెబ్ సిరీస్ రూపంలో విడుదల చేస్తాడు. మొత్తానికి క్రిష్ ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే సినిమాలను నిర్మించడం అనేది సాహాసంతో కూడిన పనే అని చెప్పుకోవాలి ఏది ఏమైనా క్రిష్ కూడా తన సినిమాల జోరును పెంచాడు.