టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావు హఠాన్మరణం చెందారు. నవంబర్ 27 శుక్రవారం ఉదయం ఆయన ఊరు నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా హఠాత్తుగా ఆయనకు ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఈ దర్శకుడి భౌతికకాయాన్ని ప్రస్తుతం వారి అత్తగారు ఊరైనా నల్లజర్ల దగ్గరలోని కౌలురు గ్రామంలో ఉంచారు.
అక్కడే కెఎస్ నాగేశ్వరరావు అంత్యక్రియలు జరగనున్నాయి.తొలిచిత్రం ‘రిక్షా రుద్రయ్య’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అనంతరం ఆయన రియల్ స్టార్ శ్రీహరిని ‘పోలీస్’ సినిమాతో హీరోగా పరిచయం చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. తర్వాత సాంబయ్య, శ్రైశైలం, దేశద్రోహి, శివన్న, వైజయంతి వంటి చిత్రాలు తీశారు నాగేశ్వరరావు. కాగా నాగేశ్వరరావుకు ఒక కుమారుడు, కుమార్తె, భార్య ఉన్నారు.