‘హౌరా బ్రిడ్జ్‌’ క్లైమాక్స్‌ హైలైట్‌

director Rewon yadhu about howrah bridge movie climax

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా తెరకెక్కుతున్న ‘హౌరాబ్రిడ్జ్‌’ చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్‌లు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఖచ్చితంగా సినిమా చూడాలని యూత్‌ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు యాదు విభిన్నంగా తెరకెక్కించాడు. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే డ్రామా సీన్స్‌ మరియు మాస్‌ను ఆకట్టుకునే రొమాంటిక్‌ సీన్స్‌ అన్ని సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఇక ఈ చిత్రం క్లైమాక్స్‌ గురించి దర్శకుడు ప్రత్యేకంగా చెబుతున్నారు. దర్శకుడు యాదు మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు సంతోషకరమైన క్లైమాక్స్‌ను కోరుకుంటారు. ఈ చిత్రంలో కూడా కథ సుఖాంతం అవుతుంది. అయితే క్లైమాక్స్‌కు ముందు వచ్చే ట్విస్ట్‌లతో ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వడం ఖాయమని, క్లైమాక్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకులకు పూర్తి సంతృప్తిని ఇచ్చే విధంగా ఉండి, సినిమాకు క్లైమాక్స్‌ అనేలా ఉంటుందని దర్శకుడు యాదు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఎక్కడ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా ఇదో ట్రెండ్‌ సెట్టర్‌ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.