షూటింగ్ చేస్తుండగా వాటర్ ఫాల్స్ లో పడి యువ దర్శకుడి మృతి

director santhosh shetty dies in waterfall shoot at karnataka

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కన్నడ చలనచిత్ర రంగం వర్ధమాన దర్శకుడిని కోల్పోయింది. దక్షిణ కన్నడ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చలనచిత్ర రంగానికి చెందిన వర్ధమాన దర్శకుడు సంతోశ్‌శెట్టి దుర్మరణం చెందారు. సంతోష్ శెట్టి దుర్మరణంతో కన్నడ చలనచిత్ర రంగంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. 2013 లో కన్నడంలో విడుదలైన ” కనసు ” చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ” సంతోష్ శెట్టి ” జల సమాధి అయి మరణించారు. కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా లో వాగులు , నదులు ఉప్పొంగి పోతున్నాయి కాగా అదే సమయంలో షూటింగ్ నిమిత్తం దర్శకులు సంతోష్ శెట్టి నిన్న ఉదయం అయిదుగురి బృందంతో కలిసి బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్ వాటర్ ఫాల్స్ కు వెళ్ళాడు. అయితే షూటింగ్ లో భాగంగా కాలుకి బరువైన వస్తువు కట్టుకున్నాడు, ఒక్కసారిగా నీటి ఉధృతి పెరగడంతో అదుపు తప్పి నీటిలోపడి కొట్టుకుపోయాడు. షాక్ అయిన మిగతా సిబ్బంది తేరుకుని అగ్నిమాపక సిబ్బంది కి తెలియజేయడంతో వారు రంగంలోకి దిగి గాలించగా అప్పటికే విగాతజీవిగా దొరికాడు ఆ యువ దర్శకుడు. మృతదేహాన్ని వెలికి తీసి బెళ్తంగడికి తరలించారు. తర్వాత కటిల్‌లోని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి కుటుంబ సభ్యులని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు