కాంప్రమైజ్‌ అయిన శంకర్‌

Director Shankar Compromise on Robo 2.0 movie Graphics work

తమిళ దర్శకుడు శంకర్‌ బాలీవుడ్‌ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తన ప్రతి సినిమాను తెరకెక్కిస్తాడు. బడ్జెట్‌ విషయంలో క్వాలిటీ విషయంలో, గ్రాఫిక్స్‌ విషయంలో ఇలా ప్రతి విషయంలో కూడా బాలీవుడ్‌ సినిమాలను తలదన్నాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు శంకర్‌ తన ప్రతి సినిమాను రిచ్‌గా తెరకెక్కిస్తాడు. ఈయన గత చిత్రాలను తీసుకుంటే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. తాను అనుకున్న ఔట్‌ పుట్‌ వచ్చే వరకు కాంప్రమైజ్‌ కాని వ్యక్తి శంకర్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న అంశాలకు కూడా లక్షలు, కోట్లు ఖర్చు చేస్తాడు అనే విమర్శ శంకర్‌పై ఉంది. అయినా కూడా సినిమానే ప్రాణంగా తీసే శంకర్‌ ఎప్పుడు కూడా తాను అనుకున్న విషయంలో కాంప్రమైజ్‌ కాలేదు. మొదటి సారి ‘2.0’ చిత్రం కోసం కాంప్రమైజ్‌ అయినట్లుగా తెలుస్తోంది.

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌తో తెరకెక్కించిన ‘రోబో’ చిత్రంకు సీక్వెల్‌గా ‘2.0’ చిత్రంను మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. దాదాపు సంవత్సర కాలంగా ఈ చిత్రం కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సంవత్సరం నుండి అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. తాజాగా ఈచిత్రంను విడుదల చేసేందుకు డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. గ్రాఫిక్స్‌ కోసం దాదాపు సంవత్సర కాలంగా వాయిదాలు వేస్తూ వస్తున్న శంకర్‌ ఆ గ్రాఫిక్స్‌ వర్క్‌ పూర్తి కాకుండానే, ఒక కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ను పూర్తి చేయకుండానే సినిమాను విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. ఆ సీన్‌ వల్ల సినిమా ఆలస్యం అవుతుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు శంకర్‌ కాంప్రమైజ్‌ అయ్యి, ఆ సీన్‌ లేకుండానే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా కనిపించబోతున్నాడు.