ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డైరెక్ట‌ర్ శంక‌ర్ కృత‌జ్ఞ‌త‌లు

director shankar congratulations to cm kcr

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇక్క‌డ తెలంగాణా సినిమా ఇండ‌స్ట్రీని అభివృద్ధి చేయ‌డానికి చాలా కృషి చేస్తున్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. దానికోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తెలంగాణ నుంచి ఇండ‌స్ట్రీకి ద‌ర్శ‌కుడిగా వ‌చ్చి గుర్తింపు తెచ్చుకున్న ఎన్‌.శంక‌ర్‌కు ఇక్క‌డ సినిమాను అభివృద్ధి చేసే నిమిత్తం 5 ఎక‌రాల స్థలాన్ని కేటాయిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం జీవోను జారీ చేసింది. జీవో ప్ర‌కారం శంక‌ర‌ప‌ల్లిలోని మోకిల్ల‌లో స్టూడియో నిర్మాణం కోసం ఐదెక‌రాల భూమిని కేటాయించారు. తెలంగాణ సినిమా ఉన్న‌తి కోసం ముఖ్య‌మంత్రి చేసిన స‌హ‌కారానికి ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్ జూన్ 19న ముఖ్య‌మంత్రిని క‌లిసి.. ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.