డియర్ కామ్రేడ్ నుండి గిర గిర గిర తిరగలిలాగా

gira gira from dear comrade

విజయ్ దేవరకొండ అభిమానులంతా ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ సినిమా కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన నటించింది. ఆల్రెడీ ‘గీత గోవిందం’తో భలే జోడీ అనిపించుకున్న జంట కావడంతో, ఈ సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి మూడో లిరికల్ సాంగును విడుదల చేశారు. ”గిర గిర గిర తిరగలిలాగా .. తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదుగా.., అలుపెరుగక తన వెనకాలే అలసి సొలసి పోయినా మనసే కరుగ లేదులే” అంటూ ఈ పాట సాగుతోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. రెహ్మాన్ సాహిత్యం .. గౌతమ్ భరద్వాజ్ – యామినీ ఘంటసాల ఆలాపన మనసుకు పట్టేలా వున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడియస్ సాంగ్స్ లో ఇదొకటని చెప్పొచ్చు. వచ్చేనెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పెళ్లి నేప‌థ్యంలో వ‌చ్చే సాంగ్‌గా గిర గిర గిర ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. చిత్రంకి సంబంధించి ఇప్ప‌టికే రెండు పాట‌ల‌ని విడుద‌ల చేయ‌గా, వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా విడుద‌లైన మూడో పాట‌ని మీరు విని ఎంజాయ్ చేయండి.