ఓకే వేదిక మీద కోహ్లీ-ఎన్టీఆర్…ఎందుకంటే ?

kohli and ntr on one stage

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి పనిచేయడం ఏంటని అనుకుంటున్నారా? ఎన్డీటీవీ తయారు చేయనున్న ఓ అవగాహనా కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు. మందు కొట్టి వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి. దీనిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌ను కల్పించేందుకు ఎన్డీటీవీ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భారత జట్టు క్రికెట్ టీమ్ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, ఎన్టీఆర్ లు క‌లిసి వ‌ర్క్ చేయ‌బోతున్నారు. వీరిద్దరే కాదు. పలు రంగాల్లోని మరో ఏడుగురు సెల‌బ్రిటీలు కూడా ప్ర‌చారక‌ర్త‌లుగా ప‌నిచేయ‌నున్నారని తెలుస్తోంది. నేడో, రేపు ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడుతుందని సమాచారం.