టీడీపీకి నలుగురు ఎంపీల జంప్…స్పందించిన బాబు

four mps jump

టీడీపీ రాజ్యసభ సభ్యులు సొంత పార్టీకి షాకిచ్చారు. తిరుగుబావుటా ఎగరవేసి వేరు కుంపటి పెట్టేశారు. తమను ప్రత్యేకంగా ఓ గ్రూపుగా పరిగణించాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యకు లేఖ రాశారు. ఈ లేఖపై సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్‌రావు, టీజీ వెంకటేష్‌లు సంతకాలు చేశారు. అలాగే పార్టీ మార్పుపై కూడా స్పందిస్తూ.. తమపై ఒత్తిడి ఉందని.. అందుకే తప్పనసరి పరిస్థితుల్లో వెళ్లక తప్పడం లేదని వ్యాఖ్యినించారట. ఇదిలా ఉంటే.. తాజా పరిణామాలపై విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు స్పందించారట. పార్టీ సీనియర్లతో టీడీపీ అధినేత చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారట. బీజేపీ చర్యల్ని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పోరాడామన్నారట. పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని.. నేతలు, కార్యకర్తలు అధైర్యపడొద్దని పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయాలకోసం కొందరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన నష్టమేమీ లేదన్నారట. అలాగే టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీల వ్యవహారం, కాకినాడలో కాపు నేతల సమావేశంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా స్పందించారు. న్యూస్ ఛానల్స్‌లో వచ్చిన కథనాలు చూసి నేతలతో సంప్రదిస్తున్నాను అన్నారు కళా. ఎంపీలు పార్టీ మారే విషయంపై తనకు సమాచారం లేదని.. టీడీపీ ఎంపీలతో మాట్లాడుతున్నానని చెప్పారు.