సాయి పల్లవి అక్కడా చూపించింది

Shanthanu Bhagyaraj removes Sai Pallavi as Heroine in his movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘ఫిదా’ చిత్రంతో తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న సాయి పల్లవి తెలుగులో స్టార్‌ హీరోల దృష్టిని ఆకర్షించింది. తెలుగులో ఈమెకు పలు అవకాశాలు వచ్చాయి. కాని ఈమె మాత్రం కథ, హీరో, దర్శకుడు అంటూ పలు కారణాలు చెబుతూ వాటికి నో చెప్పింది. తాజాగా ఈ అమ్మడు తెలుగులో ఒక స్టార్‌ హీరో సరసన నటించేందుకు నో చెప్పింది. కారణం కథ తనకు నచ్చలేదని, కథ నచ్చకుంటే తాను నటించలేను అంటూ తేల్చి చెప్పింది. దాంతో పాటు తెలుగులో ఈ అమ్మడు దిల్‌రాజు చిత్రాన్ని కూడా కాదన్న విషయం తెల్సిందే. ఆ కారణంగానే ఈమెకు పొగరు అంటూ పేరు పడిపోయింది.

తాజాగా తమిళనాట కూడా ఈ అమ్మడు ఆ పేరు తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. శంతను భాగ్యరాజా దర్శకత్వంలో ఒక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రంకు రంగం సిద్దం అయ్యింది. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో, చిత్రీకరణ మొదలు పెట్టబోతున్న సమయంలో సాయి పల్లవి తీరు నచ్చక పోవడంతో ఆమెను తప్పిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. సాయి పల్లవి స్థానంను సమంతతో భర్తీ చేయాలనే నిర్ణయానికి శంతను భాగ్యరాజా వచ్చినట్లుగా తెలుస్తోంది. సాయి పల్లవి అతి చేయడం వల్లే, తన పాత్రకు సంబంధించిన మార్పులు కోరడం వల్లే ఆమెను తొలగించినట్లుగా తెలుస్తోంది. తన అతి పొగరును చూపడం వల్లే శంతను తొలగించాడని తమిళ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి లేదా సాయి పల్లవి నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. మొత్తానికి సాయి పల్లవి పొగరుబోతుతనం వల్ల చాలా అవకాశాలు మిస్‌ అవుతుందని చెప్పుకోవచ్చు.